Categories
తెల్లవారి లేచిన దగ్గర నుంచి పాల పాకెట్ లతో మొదలుపెట్టి రాత్రి పడుకొనేవరకు మనం వాడే వస్తువులన్ని ప్లాస్టిక్ వే. కొన్ని రకాల ప్లాస్టిక్ పాకెట్లలో మైక్రోవేన్ లో వాడేందుకు సురక్షితం అని రాసి ఉంటుంది ,కానీ వాటిని వేడిచేస్తే ప్లాస్టిక్ నుంచి రసాయనాలు విడుదలై ఆహరంలో కలుస్తాయి. సాధ్యమైనంత వరకు వీటి వాడకం మానేయాలి.కూరగాయలు ఆహరపదార్ధాలు తీసుకెళ్ళేందుకు గుడ్డతో లేదా జనపనారతో కుట్టిన సంచీలు వాడుకోవాలి. సింథటింక్ ఫైబర్ తో తయారు చేసిన తివాచీలు సోఫా కవర్లు వాడకం మానేయాలి. పిల్లలకు వాడే నాపీలు శానిటరీ నాప్ కీన్లు కూడా ప్లాస్లిక్ తో తయారైనవే,వీటిని ప్రత్యామ్నాయంగా గుడ్డతో తయారైన న్యాప్ కీన్లు మార్కెట్లోకోచ్చాయి. అవి వాడటం మంచిది.