బరువు తగ్గేందుకు ఎలా తింటే బావుంటుందా అని చాలామంది ఆలోచిస్తారు. వెనిలా సువాసనలో ఉండే కొవ్వోత్తుల్ని ఇంట్లో వెలిగిస్తే ఆ వాసనకు తీపి తినాలన్న కోరిక తగ్గిపోతుంది అంటున్నాయి పరిశోధనలు. బరువు తగ్గాలనుకుంటే మంచి చిట్కా ఇది. ఎరుపు రంగు ప్లేటులో తింటే 40 శాతం తక్కువ తింటారట. టీవీ చూస్తూ తింటే రెండింతలు ఎక్కువ తింటారు. స్పూన్ తో నూనె కొలిచి కూరలు చేస్తే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తే అవి పంచదార,నిమ్మరసం నీళ్ళు ఏవైన సరే వాటిని సన్నటి పోడవాటి గ్లాసులో తాగితే ఎక్కువ తాగిన తృప్తి వస్తుంది. స్వీట్లు, చాక్లేట్లు తినకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే వాటిని అస్సలు కొనకుండా ఉండాలి.