Categories
ఈ ప్రపంచంలో అంతుపట్టని రహస్యాలు అనేకం ఉన్నాయి . అలాంటి విచిత్రాలను చూసేందుకు టూరిస్టులు క్యూలు కడతారు . మెక్సికో లోని యుకటనాలో కెనోట్ జాపొట్ అనే ఒక కొలనులో ఎన్నో గంటలు కనబడతాయి . అవి మోగే గంటలు కావు . గుహపై కప్పు నుంచి రకరకాల పరిమాణాల్లో కిందకు వేలాడుతూ ఉంటాయి . అవి ఎలా ఏర్పడ్డాయో ఎవ్వరికీ అంతుబట్టలేదు . నీళ్ళలో ,గుహలు ఒక రకమైన పదార్ధ పొరలు పొరలుగా ఏర్పడి ఈ గంటల్లాగా తయారయ్యాయి. వీటిని హెల్ బెల్స్ అంటే నరకపు గంటలు అని కూడా పిలుస్తారు . గుహ మార్గం చాలా ఇరుగ్గా ఉంటుంది . గజ ఈతగాళ్ళ సాయంతో పర్యాటకులు వీటిని చూస్తుంటారు .