Categories
ఎల్లోరా గుహల్లో ని కైలాస ఆలయం కేవలం రాతి కొండను మలిచి నిర్మించారు. నిర్మాణం లో రాళ్ళు ఇసుక సిమెంట్ ఏవి ఉపయోగించలేదు పురావాస్తు పరిశోధకుల అంచనా ప్రకారం నాలుగు లక్షల టన్నుల రాయిని చెక్కి ఈ ఆలయం నిర్మించారని అంచనా. శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీ.శ 783 లో పూర్తి చేసినట్లు తేలింది. ఇందులోని విగ్రహాలు దాదాపు ఆరువందల వ సంవత్సరం లో నిర్మాణం ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిర్మాణానికి 150 ఏళ్ళు పట్టిందట. ఔరంగాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న 32 ఎల్లోరా గుహలుల్లోని కేవ్ 16 లో ఉందీ ఆలయం. ఆలయం భూమి పైన పునాది నుంచి కాక పై నుంచి కిందకు అంటే గుహ అడుగు నిర్మించారు. ఎంతో అందంగా ఉంటుందీ ఈ ఆలయం.