Categories
కాటన్ లెదర్ బ్యాగ్ లు ఎప్పుడూ వాడుకొనేవే . ఈ మధ్య న్యూయార్క్ ఫ్యాషన్ వార్ లో క్రొచెట్ బ్యాగ్ లు ప్రదర్శనకు పెడితే అవి కాస్తా హాట్ పేవరెట్స్ అయిపోయాయి . ఎప్పుడో మనదేశంలో ఈ అల్లిక బ్యాగ్ లు వాడేవాళ్ళు ఊలు,దారంతో అల్లిక ఈ బ్యాగ్ లు ఎంతో బావుండేవి . లేసు అల్లికతో ,క్రోచెట్ క్లచ్ లు ,బ్యాగ్ ప్యాక్ లు ఊలు లేసు కలయికతో హ్యాండ్ మేడ్ ,పర్సులు ,క్రొచెట్ టోల్ బ్యాగ్స్ మళ్ళి మార్కెట్ లోకి వచ్చాయి . 2019 వ సంవత్సరానికి గానూ 1187 క్రొచెట్ బాగ్స్ ఇమేజ్ నెట్ లో కనిపిస్తూ ఉంటాయి . ఆర్డర్ ఇస్తే ఇంటికొచ్చేస్తాయి . ముడులు వేస్తూ అల్లే ఈ బాగ్స్ చాలా సౌకర్యంగా కూడా ఉంటాయి .