శరవేగంతో పూర్తవుతున్న అధ్యాయాల్లో రోజుకో కొత్త విషయం తెస్తుంది. వయసు మళ్ళుతున్న వారిలో జ్ణాపకశక్తి ఎందుకు తగ్గుతుందని చేస్తున్న అధ్యాయనంలో పెద్ద వాళ్ళు సామాజిక వెబ్ సైట్ ఫేస్ బుక్ వాడకంలో చురుగ్గా ఉంటే వారికి ఎంతో ప్రయోజనం అని తేలింది. వాళ్ళలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉందని. ఫేస్ బుక్ వాడకంలో చురుగ్గా ఉన్న కొద్ది జ్ఞాపకశక్తి ఇంకా మెరుగవుతుందని కనుగొన్నారు. వారికి కొత్త నైపుణ్యాలు మెరుగుపరుచుకోవటంలో ఉత్సాహం రావడం సామాజిక అనుసంధానంలో ఎక్కువ మంచి చేయడంతో జ్ఞాపకశక్తి మెయిన్ టెయిన్ చేసేందుకు ఉపకరించటం జరుగుతుందని చెపుతున్నారు. ప్రతి నిత్యం ఎంతో మందితో టచ్ లో ఉండటం , స్నేహ బాంధవ్యాలు ఉండటం కుడా అదనపు ఉత్సహాన్ని ఇస్తుంది అంటున్నారు.

Leave a comment