ఒక అధ్యాయనం ప్రకారం ప్రముఖ కంపెనీలకు చెందిన కాస్మోటిక్స్ ఉత్పత్తుల్లో రసాయనాల సమ్మెళనాలు మితిమీరి ఉన్నాయట. సీసం పరిమితి శాతం 20 పీపీఎమ్ లు కాగా టాల్కం ఫౌడర్లో 21 శాతం, షాంపుల్లో 24.2 శాతం, కాటుకలో 136.3 , హెయిర్ ఆయిల్ 71.9 సీపీఎమ్ లు ఉన్నాయని తేలింది. ఫారఫినిలిన్ డయామిన్ జుట్టుకు వేసే రంగుల్లో తప్పనిసరిగా ఉంటుంది. చాలా మందిలో కాంటాక్ట్ ఎలర్జిక్ డర్మీటైట్ కాస్ కు ఇదే కారణం. దీని వల్ల డై వేసుకున్నాక సున్నితమైన కనురెప్పల పైన కణతల దగ్గర, చెవుల మీద వెనక తల పై ఎర్రని వాపు పుండ్లు వస్తాయి. అందుకే డై వేసుకునేటప్పుడు టెస్ట్ చేసుకుని చూసుకొని మరి వేసుకోండి.

Leave a comment