చర్మానికి ఎటువంటి సౌందర్య సాధనాలు వాడకుండా ఉండటమే స్కిన్ ఫాస్టింగ్. గాజు వంటి అందమైన మెరిసే చర్మం గ్లాస్ స్కిన్ కోసం సరికొత్త స్కిన్ ఫాస్టింగ్ ట్రెండ్  ఉపందుకొంది. జపాన్ కు చెందిన మిరాయి క్లినిక్ అనే ఒ స్క్రీన్ కేర్ కంపెనీ నూతన సృష్టి ఇది. సాంప్రదాయ ఉపవాసాలతో శరీరానికి ఎలా లాభం చేకూరుతుందో,అలాగే ఎలాంటి సౌందర్య సాధనాలు వాడకుండా చర్మానికి సహజమైన గాలి తగులుతూ ఉంటే మెరిసిపోతుంది అని చెబుతోందీ ఈ ప్రక్రియ.ఇలాంటి క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు, మేకప్ అప్లయ్ చేయకుండా వదిలేస్తే చర్మంలోని సహజసిద్ధమైన నూనెల ఉత్పత్తి జరిగి తేమ అంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ స్కిన్ ఫాస్టింగ్ తో చర్మం మెరిసిపోవటం ఖాయం.

Leave a comment