మానసిక అనారోగ్యాలకే కాదు,ఇతరాత్ర గాయలై ఆస్పత్రి పాలైన వారికి కోలుకొంటున్న సమయంలో పక్కన పెంపుడు జంతువు ఉంటే త్వరగా సాధారణ ఆరోగ్యం పొందుతారని ఒక సర్వే బలంగా చెపుతుంది. అధిక రక్త పోటుతో బాధపడే వారు,ఒత్తిడికి గురయ్యే వాళ్ళు పెంపుడు జంతువులతో గడపటం ద్వారా ఆ వ్యతిరేఖ ఇబ్బంది నుంచి త్వరగా బయటపడపగలదని ధృవికరించబడింది. ఒంటరి తనం నుంచి బయటపడేసే శక్తి పెంపుడు జంతువుతో కలిగే అనబందంలో ఉంటుందనీ ఆ సమయంలో ప్రశాంత అందించే హార్మోన్ అధికంగా విడుదల అయి రక్త పోటు తగ్గిపోతుందని అధ్యయనాలు రుజువు చేశాయి. మనుషులకు మంచి మిత్రులు పెంపుడు జంతువులు అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment