ఆరనైదో తనము ఏ చోట నుండో..

అరుగులలికే వారి అరచేత నుండు
తీరైన సంపద ఎవరింట నుండూ..
దిన దినము ముగ్గుల్ల లోగిళ్ళ నుండూ”

వనితలు!! ఇంటి ముందర రంగవల్లి తీర్చి దిద్దారా? పదండి మరి గాజులమ్మని కొలువు తీరుద్దాం.ఆడపిల్లలకి చేతి నిండుగా గాజులే అందం కదా!! అందులో పసుపు,ఆకు పచ్చ రంగుల కలయిక మరీ వన్నె తెస్తుంది.

గాజులమ్మ అంటే మరి అంత పవిత్రమైన తల్లి. శుక్రవారపు పొద్దు గాజులమ్మకి పూజ మాటలలో వర్ణించటానికి పదాలు లేవు మరి ఆ తల్లి పూజించి అనుగ్రహం పొందుదామ!!

ముందుగా పసుపుతో గౌరీదేవిని పూజించి, పసుపు, ఆకు పచ్చరంగుల కొత్త గాజులు
తీసుకొని పసుపు రంగు దారంతో శ్రీ లలితా సహస్ర నామము పఠిస్తూ గాజులని దండగా కూర్చి గాజులమ్మకి పూలమాలగా అర్పించాలి.గాజుల సవ్వడే ఆ తల్లికి నైవేద్యం
మరి.ముత్తైదువతనానికి ఆ తల్లి కటాక్షం ఉంటే చాలు.

ఇష్టమైన పూలు: గన్నేరు,మందారం,గులాబీలు.

ఇష్టమైన రంగులు: ఎరుపు,పసుపు,ఆకు పచ్చ. తెలుపు- నలుపు అనివార్యం.

ఇష్టమైన అభిరుచులు:నృత్యం,గానం,లలిత సహస్ర నామ స్తోత్ర పఠనం.ముత్తైదువులకు తప్పకుండా తాంబూలం ఇవ్వడం.

నిత్య ప్రసాదం: కొబ్బరి,ఉడికించిన శనగలు, దానిమ్మ పండ్లు.

శనగల తయారి:ముందు రోజు రాత్రి శనగలు నానబెట్టాలి,ఉదయం కుక్కర్లో రెండు కూతలు వచ్చిన తరువాత మూకుడు పెట్టి నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర,ఎండుమిరపకాయల్ని,కర్వే పాకు వేసి
ఉడికిన శనగలు వేసి తగినంత ఉప్పు వేసి దించాలి. గాజులమ్మకు ఎంతో ఇష్టమైన శనగల నైవేద్యం తయారు!!
“ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ”.

-తోలేటి వెంకట శిరీష.

Leave a comment