ఈ సీజన్ కి సంభందించి ఫ్యాషన్ కలర్ ఏదని ఏ ఫ్యాషన్ డిజైనర్ ని అడిగిన బ్లాక్ అని చెప్తారు. చలి కాలంలో బ్లాక్ శారీ చాలా బాగా సూట్ అవుతుంది. నల్లని చీర ల పైన బంగారు రంగు అంచు డిజైన్ పెద్ద బొర్డర్లు,స్క్వేర్ కట్ డిజైన్ లు బావుంటాయి. వేసవి కాలంలో బ్లాక్ శారీ నషేధమే ఎండను లాగేస్తుంది కనుక. కాని ఈ చలి కాలంలో మాత్రం నలుపురంగు చీర కట్టుకుంటే స్వెట్టర్లు కూడా అవసరం లేదు. ఎన్నో డిజైన్ లలో ఉండే ఈ నలుపు చీరలను ఒక్కొక్కసారి అన్ లైన్ లో వెతకాలి. అసలు నలుపు పైన ఇన్ని వర్ణాలు ఎలా మ్యాచ్ అవుతాయ అనిపిస్తుంది. ఏకంగా ఇంద్రధనస్సులో వచ్చే రంగులన్ని నల్ల చీరల పై  వచ్చి వాలాయి.

Leave a comment