నీహారికా ,
ఈ మధ్య కాలంలో ప్రపంచం చాలా మారిందంటావు. ఎలా మారిందో ఒక్క ఉదాహరణ చెప్పు అన్నావు . సరే విను. ఫ్యాషన్ రంగం. వంటల రంగం ప్రముఖంగా వినిపంచేవి మగవాళ్ల పేర్లే. అద్భుతమైన జ్యూవెలరీ తయారీ మగవాళ్లదే. ఆడవారికి అవసరమైన వన్నీ సృష్టించేది మగవాళ్లే. అలాగే వాళ్ళ ఇష్టాయిష్టాలన్నీ బాగానే పసిగడుతున్నారా ? లేదా ? వంటలతో బెస్ట్ చెఫ్స్ గా మగవారే కదా. డాన్సింగ్ స్కూల్స్ మగవాళ్లవేనా ? ఫ్యాషన్ రంగాన్నీ వాళ్లే. షాపింగ్ ఎంత కంఫర్టబుల్ గా చెయ్యాలో ఎలా ఉంటే ఆడవాళ్లు షాపులకు పరుగెత్తుకొస్తారో డిజైన్ చేసేది ఎవరు ? ఆడవాళ్ళ సంపాదన ఎక్కువైతే ఇంటి పట్టున ఉంది హౌస్ హస్బెండ్స్ గా బాధ్యత తీసుకునేవాళ్ళు ఎక్కువవడం లేదా ? భార్య భర్తలకు సమాజం నిర్దేశించిన బాధ్యతలకు దాటి ముందుకెళుతున్నారా ? లేదా ? నా సంపాదన మీద పెత్తనం నాదేనన్న భావన పోతుంది . ఇద్దరు రాబడి తో బడ్జెట్ వేసుకుని ఇల్లు నిజమైన పొదరిల్లు గా మారిపోవటం లేదా ? కెరీర్ లో దూసుకుపోతున్న ఆడవాళ్ళ వెనక భర్తల సాయం ఉంటోంది. ఈ సామజిక సంసారిక సంస్కరణలు వచ్చాయి. జీవితం అనే దీపాన్ని భార్య భర్తా చెరో రెండు చేతులు అడ్డం పెట్టి కాపాడుకోవాలని చాలా మందికి అర్ధం అయ్యింది . చూద్దాం ఇంకా సమాజం మారిపోవచ్చు.