Categories
20 లక్షల అప్పు తో వి. స్టార్ అనే వస్త్రాల తయారీ వ్యాపారం మొదలు పెట్టింది షీలా కోచౌసెఫ్.ఆమె భర్త వి.గార్డ్ స్టెబిలైజర్స్ సంస్థ యజమాని షీలా స్థాపించిన అండర్ గార్మెంట్ సంస్థ 25 ఏళ్లలో వంద కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థగా మారింది. కొచ్చిన్ నగర కేంద్రంగా షీలా వి స్టార్ క్రియేషన్ సంస్థ నడుస్తుంది.మహిళల బ్రాసరీ ల తయారీలో వి. స్టార్ గుర్తింపు పొందింది. సంస్థ వెయ్యి మందికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఉపాధి కలిగిస్తుందని చెబుతోంది షీలా కేరళలో మొత్తం 16 యూనిట్స్ పనిచేస్తున్నాయి స్థానిక మహిళలు కిందిస్థాయి సామాజిక వర్గ స్త్రీలే వీటి తయారీలో పాల్గొంటారు శిక్షణ ఇచ్చి మహిళలను ఉద్యోగంలోకి తీసుకుంటారు.