జర్నలిజం, సాహిత్య రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు పులిట్జర్ ఈ ఏడాది మేఘ రాజగోపాలన్ ను వరించింది. ఇన్నోవేటివ్ ఇన్వెస్టిగేషన్ కేటగిరీలో మేఘన కు ఈ అవార్డు దక్కింది. మేఘా భారతీయ మూలాలున్న జర్నలిస్ట్ బజ్ ఫీడ్ సంస్థ లో పని చేస్తోంది. చైనాలోని షిన్ జియాంగ్ అనే ప్రాంతంలో వేలకొద్ది ముస్లింలను అక్కడి ప్రభుత్వం నిర్బంధించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో జైళ్ళనూ నిర్భందంగా క్యాంప్ లను నిర్మించింది. దీనిపై మేఘ వరస కథనాలు ప్రచురించింది కానీ చైనా ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చింది . ఆమె వీసా రద్దు చేసి దేశం నుంచి పంపేసింది .దీనితో లండన్ వెళ్ళిన మేఘ అక్కడి నుంచే పరిశోధన ప్రారంభించింది. ఇందుకు గానూ శాటిలైట్ ఇమేజెస్,ఆర్కిటెక్చర్ ఫోరెన్సిక్ అనాలసిస్ నిపుణుడు ప్రోగ్రామర్ సాయంతో ఆధారాలతో సహా అక్రమాలను బయటపెట్టింది. యుగరస్ కాజర్స్, ఇతర ముస్లిం మైనారిటీ లను చైనా ఎక్కడ బంధించిందో పేరుతో కథనాలను ప్రాణాలకు తెగించి ఈ ప్రపంచం ముందుకు తెచ్చింది. చైనా ముస్లిమ్ లు వలసపోయిన ప్రాంతాలకు వెళ్లి వారిని ఒప్పించి సమాచారం సేకరించింది .ఈ సాహసం చేసినందుకు గాను పులిట్జర్ అవార్డ్ దక్కింది మేఘనా గోపాలన్ కు.
Categories