ఒక్కసారి కరోనా వస్తే మళ్ళీ మళ్ళీ వస్తుందా ?రాధా అన్న ప్రశ్న ప్రతి చోటా తలెత్తుతోంది .ఇప్పటి వరకూ జరిగిన అధ్యయనాలు వైరస్ మన శరీరంలో యాంటీ బాడీలు అడ్డుకుంటాయనే చెబుతున్నాయి .సాధారణంగా చికెన్ ఫాక్స్ ,మజిల్స్ మొదలైన వైరస్ ఇన్ఫెక్షన్ కు శరీరం గురవుతాయి. ఆ వ్యాధి మరోసారి సోకకుండా శరీరంలో యాంటీబాడీస్ తయారై రక్షణ కల్పిస్తాయి అయితే ఫ్లూ, డెంగ్యూ జలుబు వంటి వైరస్ లు మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి .అంటే శ్వాసకోశ వ్యవస్థలో కి యాంటీబాడీలు చేరలేదు అనుకోవాలి.ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కనుక ఏ వైరస్ నైనా కొంతవరకు ఎదుర్కో గలుగుతోంది.అది ఎంత వరకు సామర్థ్యం కలిగి ఉందన్న అంశంపైనా కోవిడ్ -19 మళ్లీ సోకుతుందా అన్న ప్రశ్నకు సమాధానం ఉంది.అందుచేత వైరస్ సోకిన ,దగ్గరకు కాకపోయినా మాస్క్ ధరించడం సామాజిక దూరం పాటించటం ఇప్పట్లో చాలా అవసరం అంటున్నారు అధ్యయనకారులు.
Categories