బరువు తగ్గాలనుకుంటే ఏం చేస్తారు ముందు ఆహారంలో కొవ్వులు తగ్గిస్తాయి. పోషకాలు తీసుకోరు. లోఫ్యాట్ డైట్ ఫాలో అవ్వుతారు. దీని వల్లనే చాలా ప్రమాదాలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొవ్వుని కరిగించే ప్రక్రియలో పోషకాలదే కీలక పాత్ర. ఫ్యాట్స్ తగ్గిస్తే మంచిదని వీటి స్ధానంలో రిఫైన్డ్ లేదా హైడ్రోజినేట్ ఫ్యాట్స్ వుపయోగిస్తారు. ఇప్పుడిక నెమ్మదిగా ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్  పనిచేయడం మానేస్తాయి. 70 శాతం మెదడు  ఫ్యాట్స్ తోనే తయ్యారవ్వుతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మం పొడి బారడం జుట్టు డ్రైగా అయిపోవడం తెలుస్తుంది. ఎనర్జీ లెవెల్స్ తాగి వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితంలో ప్రతిభ లోపిస్తుంది. ఆటో ఇమ్యున్ రుగ్మతలు వస్తాయి. కొబ్బరి, బాదం, ఆలివ్, అవిసె గింజల నూనె వంటి మంచి ఫ్యాట్స్ శరీరానికి చాలా అవసరం. హార్మోన్లు ఫ్యాట్స్ పైన ఆధారపడతాయి.

Leave a comment