బంగారం, ప్లాటినం వంటి ఖరీదైన లోహాలతోనే ఎన్నో రకాల నగలు రూపొందించటం వాటిదే  ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రస్థానం ఉండటం అనేది పాత మాట. ఇప్పటి ట్రెండ్ కాపరే. మెరుపుతో కూడిన ఎరుపు కాపర్ అదే రాగి వర్ణం. అంతర్జాతీయ వేదికలపైన ఈ రాగి వర్ణం అద్భుతాలను సృష్టిస్తుంది. డ్రెస్ లు, యాక్ససరీస్ మాత్రమే కాదు, లిప్ స్టిక్ నెయిల్ పాలిష్, పేస్ పౌడర్లలో కాపర్ తనదైన ముద్రవేస్తుంది. ప్రాశ్చాత్య దేశాల అమ్మాయిల జుట్టూ వర్ణం కూడా కాపరే. దీం వెడ్డింగ్ లో ఇప్పుడు కాపర్ దే హవా. ఆరోగ్యం అంటూ రాగి పాత్రల్లో నీళ్ళు తాగటం ఎక్కువైంది. ఇదివరలో గిరిజన తెగలు పెట్టుకొనే రాగి నగలు ఇప్పుడు మోడరన్ అమ్మాయిలను విపరీతంగా ఆకర్షిస్తూ ట్రెండ్ సృష్టియిస్తున్నాయి. నగలు, చెప్పులు, కాస్మోటిక్స్ ఇలా మొత్తం రాగి మయం.

Leave a comment