కోవిడ్ -19 దెబ్బకు మనుషులు సమూహాలు చెల్లాచెదురయ్యాయి .ఇలాటి పరిస్థితుల్లో పెళ్ళుళ్ళు పేరంటాలు నిషిద్ధ కార్యక్రమాలు జాబితాలోకి పోయాయి .మరీ ఇప్పటికే తాంబూలాలు పుచ్చుకొన్న పెళ్ళిళ్ళకు సిద్దమైన వారి పరిస్థితి ఏమిటి ?.ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపెడుతున్నాయి మాట్రిమోనీ వెబ్ సైట్స్ . వివరాలు పంపండి మా పండితులు, పురోహితుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్ళిళ్ళు జరిపేస్తాం అంటున్నారు .ప్రముఖ మాట్రిమోనీయల్ పోర్టెల్ షాదీ .కామ్ .’నో కాంట్రాక్ట్ వెడ్డింగ్ ‘పేరుతో ఈ వినూత్నమైన ఆలోచనకు తెరతీసింది .ఇల్లు కదలకుండా ఉన్న చోటనే వైభవంగా పెళ్ళి జరిపిస్తారన్నమాట .అలాగే పెళ్ళి చేసుకొన్నా తొలి జంట అవినాష్ , కృతి .ఇక వరసలో ఎందరో ఈ  వీడియో కాన్ఫరెన్స్ పెళ్ళికి సిద్ధం గా ఉన్నారు .

Leave a comment