మొహం పైన టాన్ పేరుకొని కళావిహీనంగా అయిపోతుంది దీన్ని పోగొట్టాలంటే పావు కప్పు ఉలపిండిలో కప్పు పాలు కలుపుకోవాలి. దానికి స్పూన్ తేనె,రెండు స్పూన్ల గులాబిరేకుల ముద్ద కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమంతో పూత వేసుకొంటే టాన్ పోతుంది. అలాగే ఒక చెంచా నానబెట్టిన మెంతిపిండికి కాస్త శెనగపిండిని పెరుగుతో కలిపి పేస్ట్ లా చేసి ఈ ప్యాక్ వేసుకోవాలి రెండు ఎండు ఖర్జురాలు నానబెట్టి పేస్ట్ లా చేసి దానికి పాలు,కలబంద గుజ్జు కలిపి ముఖం పై నెమ్మదిగా వేళ్ళతో మసాజ్ చేసినట్లు రుద్ది అలా అరగంట పాటు వదిలేసి ముఖం కడిగేస్తే ముఖం కాంతితో వెలిగిపోతుంది టాన్ నెమ్మదిగా తగ్గిపోతుంది.

Leave a comment