రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు కదా పానీయం తాగాలని ప్రధాని కోరారు .వనమూలికలు సుగంధ ద్రవ్యాల తో ఈ పానీయం తయారు చేయవచ్చు .తులసి ఆకులు, యాలకులు ,దాల్చిన చెక్క ,శొంఠి ,నల్ల మిరియాల , ఎండు ద్రాక్ష ,  నిమ్మరసం తో ఈ పానీయం చేయచ్చు . దాల్చిన చెక్క ,శొంఠి,  నల్ల మిరియాలు , యాలకులు మెత్తగా పొడిచేసి మరుగుతున్న నీళ్ళలో వేయాలి .తులసి ఆకులు , ఎండు ద్రాక్ష  కూడా వేసి ఐదు నిముషాలు మరిగించాలి చివర్లో నిమ్మ రసం పిండాలి .రుచి కోసం దానిలో తేనె లేదా బెల్లం కలుపుకోవచ్చు .రోజు రెండు సార్లు ఈ పానీయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది .అంటూ వ్యాధుల బారిన పడకుండా పోరాడే శక్తిని శరీరానికి అందుతుంది .

Leave a comment