లాక్ డౌన్ సమయాన్ని సరిగ్గా ఉపయోగించు కోమంటున్నారు ఎక్స్ పర్డ్స్. ఈ కష్ట కాలం అంతం అయ్యేంత వరకు పొదుపు ప్రణాళిక పాటించ వలసిందే .అదనపు సంపాదన మార్గాలు అన్వేషించాలి .ఆన్ లైన్ లో ట్యూషన్లు , యూట్యూబ్ వీడియోలు పేస్ మాస్కులు కుట్టటం ఇలా ఎదో ఒక పని తో చక్కని దారి వెతుకోవచ్చు .కారిడార్ లో, ఆవరణలో  ప్లాస్టిక్ డబ్బాల్లో,  కుండీల్లో కూరగాయల చెట్లు పెంపకం మొదలు పెట్టవచ్చు .దుస్తులు సొంతంగా ఇస్త్రీ చేసుకోవచ్చు .కాస్త శ్రమపడితే  ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటళ్ళ లో వండే వంటకాలను వండుకోవచ్చు .వంటల వీడియోల్లో ఇప్పటికే ఇవన్ని వందల కొద్దీ ఉన్నాయి .

Leave a comment