గడచిన నా ఏడేళ్ళ ప్రయాణం ఫెంటాస్టిక్ అని ఆనందంగా చెబుతుంది అందాల నటి శృతి హాసన్. ఇంత మంది అభిమానుల ఆదరణ దొరికింది. ఈ ప్రయాణంలో. ఇది నా అదృష్టం అందువల్లే ఇంత దీర్ఘకాలం నాకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నా కోసం అందమైన పాత్రలు సృష్టించారు. నేను నటించే అవకాశం ఉన్న చక్కని సినిమాల్లో అవకాశం వచ్చింది.నేను సంతోషంగా కృతజ్ఞతగా ఉన్నా. పరిచయం లేని వాళ్లతో అంత సౌకర్యంగా మాట్లాడలేను. దయచేసి నాధోరణిని అపార్థం చేసుకోవద్దు. నేను చేసే ప్రతి పనీ నన్ను గురించి మీతో కమ్యూనికేట్ చేస్తుంది. నా అభిమానుల వల్లే నాకు ఇంత మంచి నట జీవితం దక్కింది అంటోంది శృతిహాసన్ ..