అందంగా ,మంచి ఉద్యోగం చేస్తూ ఆర్ధికంగా స్థిరంగా ఉన్న వాళ్ళనే అమ్మాయిలు భర్తగా ఇష్టపడతారని అనుకొంటారు .కానీ ఒక సర్వేలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. అమ్మాయిలు చక్కని నటులనీ ,మ్యూజిక్ లో ప్రావీణ్యం ఉన్నా వాళ్ళనీ ఇష్టపడతారట. ఒక లిస్ట్ ప్రకారం చూస్తే ఫుట్ బాల్ ఫ్లేయర్లు వరసలో చివరిగా ఉన్నారు. వాళ్ళు మరీ ఎక్కువ కాన్ఫిడెన్స్ తో సరైన రెప్యుటేషన్ లేకుండా ఉంటారన్న కారణంతో ఎవ్వళ్ళు వాళ్ళకి మంచి మార్కులు ఇవ్వలేదు. ఇంకా టీచర్లు ,రచయితలు,డాక్టర్లు,పాత్రికేయులు మొదటి లిస్ట్ ల్లో ఉన్నారు. టీచర్లు క్రమశిక్షణతో కేరింగ్ గా ఉంటారని డాక్టర్లు ప్రొపెషనల్ గా ,హుందాగా ఉంటారని,రచయితలు,పాత్రికేయులు సృజనాత్మకంగా ఆకర్షణీయంగా ఉంటారని అమ్మాయిల అభిప్రాయంగా సర్వేలు చెప్పాయి.ఏది ఎలా ఉన్నా హుందాతనం ,సృజన,కేరింగ్ గా ఉండటం అమ్మాయిలకు నచ్చాయని అబ్బాయిలు తెలుసుకోవాలి.

Leave a comment