కొన్ని పానీయాలు బరువు తగ్గించి సరైన రూపాన్ని ఇస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ పానీయాలు యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయి. బరువు తగ్గించే పానీయాల లిస్ట్ లో గ్రీన్ టీ ముందుంటుంది. గ్రీన్ టీ తో రోజులో 70కేలరీలు తగ్గుతాయి. క్యారెట్ రసంతో విటమిన్లు ఖనిజాలు ఉండటంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలే కాక బరువు తగ్గిస్తుంది. భోజనానికి ముందే ఈ క్యారెట్ రసం తీసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన పానీయం బ్లాక్ టీ. ఇది జీవక్రియను జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఆపిల్ సిడార్ వెనిగర్ లో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది. అన్నింటి కంటే ముఖ్యమైన అద్భుతమైన పానీయం నీరు. నీటిలో ఉండే మినరల్స్ శరీరంలో ఎంతో వేగంగా కరిగిపోతాయి. వ్యాయామంతో పాటు ఈ ఐదు పానీయాలు డైట్ లో చేర్చుకొమ్మంటున్నారు పరిశోధకులు.

Leave a comment