Categories
ఎంతో పని చేసి ఈ స్థాయికి చేరుకున్నాను తాప్సీ,కియారా వంటి సెలబ్రిటీల సాయం మరిచిపోలేను ఒక ఫ్యాషన్ షో లో తక్కువ సమయంలో వెరైటీ మోడల్ హెయిర్ స్టయిల్స్ మోడల్స్ ని తీర్చి దిద్దటం తో నా ఫ్యాషన్ ప్రాజెక్ట్ విజయవంతంగా మొదలైంది అంటుంది సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ సీమా మనే. షోలాపూర్ లోని బర్షీలో పుట్టిన సీమా మానే ఆశ్రమంలో పెరిగింది. వివాహం అయ్యాక భర్త సహకారంతో హెయిర్ కటింగ్ లో డిప్లొమా చేసింది. సెలూన్ నిర్వహించేది. ఎట్ ది రేట్ ఆఫ్ హెయిర్ బై సీమ ఎంతో మంది సెలబ్రెటీలు ఆమె ఖాతా దారులుగా ఉన్నారు. ఎన్నో సినిమాల్లో వెబ్ సిరీస్ లో హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసిన సీమా ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు.