మెడ చుట్టూ నలుపు పోయేందుకు ఓట్స్ బట్టర్ మిల్క్ మిశ్రమం బాగా పని చేస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. చర్మాన్ని శుభ్రం చేస్తాయి. బట్టర్ మిల్క్ లో ఉండే లాక్టిక్ యాసిడ్ నలుపు ని పోగొట్టి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. రెండు టీ స్పూన్ల ఓట్స్ అర కప్పు నీళ్లలో ఐదు నిమిషాలు నాననిచ్చి అందులో రెండు మూడు స్పూన్ల బట్టర్ మిల్క్ మొయిశ్చ రైజింగ్ కోసం తేనె కలిపి మెత్తగా పేస్ట్ లా చేయాలి. ముఖం, మెడకు, చేతులకు రాసుకుని నెమ్మదిగా మర్దన చేస్తున్నట్లు రాయాలి. అరగంట తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నలుపు తగ్గి నిగారింపు తో ఉంటుంది. అలాగే పసుపు గంధం కాసిన్ని కొబ్బరి నీళ్లలో కలిపి పేస్టులా చేసి మొహానికి రాసుకున్న ఇదే ఫలితం వస్తుంది.

Leave a comment