Categories
ప్రతి ఒక్కళ్ళు టూత్ బ్రష్ వాడతారు . ప్లాస్టిక్ తో తయారైన ఈ బ్రష్ లతో పర్యావరణానికి అంతులేని ముప్పు కలుగుతుంది . ఎప్పటికీ మట్టిలో కలిసి పోకుండా శాశ్వతంగా ఉండిపోయే ప్లాస్టిక్ టూత్ బ్రష్ ల స్థానంలో చెక్క బ్రష్ లు వస్తున్నాయి . ఈ చెక్క బ్రష్షులను వెదురు తో తయారు చేస్తున్నారు . కొన్నింటికి బ్రెజిల్స్ లో బర్కల్ ని కలపటం తో అవి పళ్ళు ను తెల్లగా మెరిసేలా చేస్తున్నాయి . వెదురు చాలా వేగంగా పెరుగుతుంది . పైగా ఆ మొక్కలకు సూక్ష్మజీవులను నాశనం చేసే గుణం కూడా ఉంది . అందువల్ల ఇవి దంతాల ఆరోగ్యాన్ని ,పర్యావరణన్నీ పరిరక్షిస్తాయని చెపుతున్నారు ఎక్స్ పర్డ్స్ . వీటిని వారానికి ఒకటి పడేయనక్కర్లేదు పైగా హాల్టర్ మార్చుకొంటే చాలు .