Categories
సామాజిక సేవ కార్యక్రమాల్లో ఎంతో మంది స్త్రీలు ఎందరికో ఆదర్శంగా ఉన్నారు .పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సీమకుర్తి సురేఖ ఎం బిఎ చేశారు .ధరిత్రి రక్షణ సమితి ఏర్పాటు చేశారామె .పర్యావరణ పరిరక్షణ ఆమె ద్యేయం .కాకినాడ ప్రాంతంలో లక్షకు పైగా మొక్కలు నాటారు .ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కోరుతూ వేల కాటన్ సంచులు పంపిణీ చేశారు .గతంలో కార్పొరేట్ ఉద్యోగం లో ఉన్న సురేఖ ఇప్పుడు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని , మొక్కలను విరివిగా నాటాలని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు .