Categories
జీన్స్ అనగానే నీలం రంగు గుర్తోస్తోంది. ఫేడెర్ రకం జీన్స్ రంగులు తలుచుకొంటాం. కానీ జీన్సే ఎప్పటికీ ఫేమస్. ఇవి శరీరాకృతికి తగినట్లుగా ఉంటే అందంగా ఉంటాయి. స్టైల్ కట్ ,యాంకిల్ లెంగ్స్ ,స్లిమ్ ఫిట్ ఇవన్నీ అందరికీ నచ్చుతాయి,నప్పుతాయి కూడా. టీషర్ట్స్ టాంక్ టాప్ ల మీదకు టోర్ట్న్ జీన్స్ వేసుకుంటే బావుంటాయి. ఈ చిరుగు జీన్స్ ఎప్పటికీ ట్రెండ్. వాష్డ్ జీన్స్ తో కాస్త మెరిసే టాప్ ఉంచుకొంటే ఇంకా బావుంటాయి. బ్యాగ్ కట్ తో బాయ్ ఫ్రెండ్ జీన్ కాస్త లావుగా ఉన్న వాళ్లు వేసుకొంటే చక్కగా ఉంటాయి. యాంకిల్స్ జీన్స్ పైకి కోల్డ్ షోల్డర్ టాప్ లో మరీ అందం ,కాస్త లేత రంగులని ఎంచుకొంటే జీన్స్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్.