ఆయుర్వేదం ప్రపంచంలోని ప్రాచీన వైద్య విధానాలతో పేరెన్నికగన్న వైద్యం. వేల సంవత్సరాలుగా కొన్నివేల మూలికలు తెలుసుకున్నారు వైద్యులు. ఆయుర్వేదం లో వాడే శక్తి వంతమైన కొన్ని మూలికల గురించి తెలుసుకోవటం మంచిదే కదా .ముందుగా తులసి లో బ్యాక్టీరియాను ఫంగస్ ను అరికట్టే రోగాలలో ఇది పల్లె వైద్యశాల అని పిలుపుతో ప్రసిద్ధి .రోగనిరోధక శక్తిని పెంచి ఒత్తిడిని మాయం చేయటం ముఖ్య లక్షణం. సాధారణ జలుబు దగ్గులకు ఇది గొప్ప ఔషధం .బిల్లగన్నేరు పువ్వులను మధుమేహ చికిత్సలో వాడతారు .ఈ పిప్పళ్లను దగ్గు జలుబు ఊపిరితిత్తుల పడిశం నిద్రపట్టకపోవడం వంటి వాటికి వాడతారు .నల్లేరు ను మెనోపాజ్ లక్షణాలకు ఉపశమనం గా చెప్తారు .ఎముకల సమస్యలను తగ్గిస్తుంది .కరక్కాయ జలుబు దగ్గు అజీర్ణం కడుపు మంటను తగ్గిస్తుంది .ఆయుర్వేదంలో త్రిఫలాలు అని చెప్పే వాటిలో మొదటిది .తాని కాయి ఇది  త్రిఫలాల లో రెండవది .తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఉసిరి త్రిఫలాల్లో మూడవది ఇందులో విటమిన్-సి న్యూట్రియాంట్స్ పుష్కలంగా ఉన్నాయి .నేల ఉసిరి శ్వాసకోశ వ్యాధులకు ఉపయోగం .పసుపు దగ్గు, జలుబు, వాపులు, నొప్పులు తగ్గిస్తుంది .మెదడకు మేలు చేస్తుంది .ఇవన్నీ ప్రస్తుతం కరోనా లక్షణాలైన దగ్గు జలుబు గొంతునొప్పి ఊపిరితిత్తుల సమస్య జ్వరం మొదలైన వన్నీ తగ్గించగలిగే దివ్యమైన ఔషధాలు .

Leave a comment