ఆహారంలో భాగంగా పుట్టగొడుగుల్ని తీసుకోవటం ఆహారానికి మంచిదే. ఇందులో బి విటమిన్, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, జింక్ వంటి ఎనో పోషకాలున్నాయి. ముఖ్యంగా డి -విటమిన్ కు పుట్టగొడుగులు అద్భుతమైన నిల్వలు అంటున్నారు డాక్టర్స్. యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు అనేక  కూరగాయలు పండ్లలో కూడా పుష్కలంగా ఉంటాయి. కానీ డి-విటమిన్ సమృద్ధిగా దొరికేది ఒక్క పుట్టగొడుగుల్లో మాత్రమే మన శరీరం సూర్యరశ్మి ద్వారా ఎలాగైతే డి విటమిన్ ను తయారు చేసుకుంటుందో పుట్టగొడుగుల్లో ఉండే ఎర్గోమైరాల్ అనే ప్రో విటమిన్ సూర్యుని అతినీలలోహిత కాంతిని గ్రహించి డి విటమిన్ గా మారుతుంది. ఈ మధ్యకాలంలో పుట్ట గొడుగుల్ని   గ్రీన్ హౌసుల్లో పెంచుతున్నారు. వీటిలో ఉండే డి-విటమిన్ అంతంతమాత్రమే ఆరు బయట సూర్యకాంతి లో పెరిగే పుట్టగొడుగుల్లోనే డి విటమిన్ అధిక శాతంలో ఉంటుంది. పాలు ఇతర జంతు పదార్థాల్లో డి విటమిన్ డి-3 రూపంలో ఉంటే పుట్టగొడుగుల్లో డి-2 రూపంలో దొరుకుతుంది గుండ్రంగా ఉండే బటన్ పుట్టగొడుగుల తో పోలిస్తే పలుచని రేకుల్లా వుండే ఆయిష్టర్ రకం పుట్టగొడుగుల్లో డి విటమిన్ ఎక్కువ ఆహారం ఎంత వీలుంటే ఎంత శాతం వీటిని చేర్చుకోవడం బెస్ట్!

Leave a comment