40 ఏళ్లు దాటినా అందం కాపాడుకో గలుగుతున్నాను అంటే కేవలం శాకాహారం వర్క్ వుట్స్. ముఖ్యంగా ఏం తింటున్నాననే దాని పట్ల ధ్యాస ఉంచటం మాత్రమే అంటోంది మలైకా అరోరా. ఆరోగ్యం తీరు శరీరం బరువు మొదలైన విషయాలు లెక్కలు తూచే ఏం తినాలో నిర్ణయిస్తారు డైటీషియన్లు. కానీ ఎంత తినాలో కూడా ఖచ్చితంగా పాటించాలి అంటారామె. నేనయితే ఉదయం గోరువెచ్చని నీరు తేనె కొబ్బరి నూనె కలిపిన పానీయం తాగుతాను. ఇది చర్మాన్ని మెరిపించి వ్యర్థాలను వెలుపలికి పంపి జీవ క్రియల్ని సమన్వయం చేస్తుంది. తాజా పండ్లు గింజలు పప్పులు వంటివి సేంద్రియ ఎరువులతో పండించే వాటికే ప్రాధాన్యత ఇస్తాను. హాయిగా మంచి భోజనం, విశ్రాంతి, వర్క్ వుట్లు ఇవే నన్ను ఉత్సాహంతో నింపుతాయి అంటుంది మలైకా అరోరా.

Leave a comment