Categories
అన్ని ప్రభుత్వాలు,సంస్థలు ఒక పరిమితి రిటైర్మెంట్ వయస్సును నిర్దేశించాయి. ఏంతో కాలం పనిచేశాక విశ్రాంతి జీవితం అవసరం అని దీని ఉదేశ్యం .కానీ పరిశోధనలు మాత్రం రిటైర్ అయ్యాక తమ సామర్ధ్యాన్ని బట్టి ఎదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేయకపోతే పని మానేసి విశ్రాంతిగా ఉన్నవాళ్ళలో శారీరక క్షిణత రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. రిటైర్మెంట్ తీసుకున్న కొందరు స్త్రీ,పురుషులపై అధ్యాయనం నిర్వహించారు. అధికారికంగా రిటైర్ అయినా పార్ట్ టైమ్ లేదా తాత్కాలిక ఉద్యోగాల్లో కొనసాగేవాళ్ళలో రక్తపోటు డయాబెటిస్,ఆర్థరైటిస్,స్ట్రోక్ ఇలాంటి సమస్యలు చాలా తక్కువే పని వల్ల వృద్దాప్యంలో మానసిక శారీరక ఆరోగ్యాలు మెరుగ్గా ఉన్నాయి అంతే కాకుండా చాలా చురుగ్గా ఉన్నారు కూడా.