రకరకాల స్నాక్స్ తీయని పదార్థాలు తినాలి అనిపించడం శరీరంలో రకరకాల పోషకాలు తగ్గటం వల్లనే అంటున్నారు నిపుణులు. చీజ్ లు పిజ్జాలు తినాలనిపిస్తే శరీరంలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం లోపం అని అర్థం చేసుకోవాలి. దాన్ని అవిసెల గింజలు వాల్ నట్స్ సబ్జా గింజల తో భర్తీ చేసుకోవచ్చు. పిస్తా పేస్ట్రీలు తినాలనిపిస్తే క్రోమియం లోపానికి సూచన. యాపిల్స్, చిలకడ దుంపల తో ఇది భర్తీ అవుతుంది. స్వీట్లు తినాలనిపిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయని అర్థం చేసుకోవాలి. పండ్లు చిక్కీలు పొట్టు తో కూడిన ధాన్యాలు  ఆహారంలో భాగంగా ఉంటే తీపి పదార్థాల వైపు  మనస్సు మళ్లదు.

Leave a comment