బరువు తగ్గేందుకు బుధ బౌల్ డైట్ ఫాలో అవుతున్నారు చాలామంది. అంటే ఒక గిన్నెలోని ఆహారం మాత్రమే తీసుకోవాలని,ఆ బౌల్ లోనే అన్ని పోషకాలు ఉండే లాగా చూసుకోవాలి అని చెబుతారు ఎక్స్పర్ట్స్.ఈ డైట్ లో సహజంగా లభించే ఆహార పదార్థాలు వాడతారు పోషకాహార నిపుణులు సలహా ప్రకారం బ్రేక్ ఫాస్ట్ బౌల్ లో ఒక అరకప్పు మొలకలు,ఉల్లికాడ టమోటో, కొత్తిమీర, క్యారట్,చిల్లీ సాస్, ఉప్పు, కారం, నిమ్మరసం, బొప్పాయి, మొక్కలు,ఎనిమిది నాన బెట్టిన బాదం పప్పులు కావాలి.ఒక పాత్రలో చిల్లీసాస్ వేసి ఒక పక్కన మొలకలు చక్రాల్లా తరిగిన టమాటో ముక్కలు ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు పేర్చుకోవాలి. ఉప్పు, కారం,నిమ్మరసం సన్నగా తరిగిన ఉల్లికాడ కొత్తిమీర, చిల్లీసాస్ వేసి కలిపి బౌల్ పేర్చిన పదార్థాల పైన చల్లాలి.బొప్పాయి ముక్కలు బాదం పలుకులు వేసుకుంటే బ్రేక్ ఫాస్ట్ బౌల్  రెడీ అయిపోతుంది.

Leave a comment