పచ్చని వాటిలో కంటే ఎరుపు రంగు ఆకుకూరల్లో, కాయగూరల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వాటికి సూపర్ ఫుడ్స్ జాబితాలోకి చేర్చారు పోషక నిపుణులు. బెండ, క్యారెట్ వంటి కాయగూరలు కూడా ఇప్పుడు ఎరుపు లో నే పండిస్తున్నారు రైతులు. భోజనం ప్లేట్ల లో రైన్ బో కలర్స్ ఉంటేనే మంచిది అంటున్నారు డాక్టర్లు. ఎర్రని ఆకుకూరల్లో ఎన్నో పోషకాలున్నాయి పచ్చదనాన్ని కంటే మూడు రెట్లు క్యాల్షియం ఐదు రెట్లు నియాసిన్ ఉంటుంది. సి,ఎ విటమిన్లు ఖనిజాలు పుష్కలం ఈ రంగు ఆకుని ఉడికించిన అప్పుడు సువాసనతో కూడిన రుచి వస్తుంది. ఆకుకూరలో, కాయగూరల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. పీచు, పొటాషియం, క్యాల్షియం, నైట్రేట్ ల శాతం కూడా ఎక్కువే అందుకే కాయగూరలు ఆకుకూరలు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోండి అంటున్నారు నిపుణులు.
Categories