Categories

ఇవి పెయింటింగ్స్ కావు ఫోటో ఫాప్ తయారీలు కూడా కావు. ఇవి భ్రాంతి కలగించే వేషం వేసుకోన్న ఒక చిత్ర కారిణి ఫోటోలు. ఈ అధివాస్తవిక దృష్టి భ్రాంతిని కలిగిస్తుంది. కళాకారిణి ,విచిత్ర రూపశిల్పి మిమిచోయి. ఎవ్వరి సహాయం లేకుండా తననుతానే రూపు దిద్దుకొంటుంది మిమి. సంప్రదాయ చిత్రాలకు వాడే కుంచెలతోనే తనని తానే ఒక కాన్వాస్ గా మార్చేసుకొంది. క్షణానికోసారి మారిపొతున్న ఇవ్వాల్టి సాంకేతిక యుగంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకొనేందుకు తన మొహాంపై తనే రంగులతో చిత్రించి ఒక అధ్భుతమైన మాయజాలాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ మేకప్ ఆర్టిస్ట్ మిమి. ఇలా తన మొహాంపైనే తను ఊహించిన నమూనాని చిత్రించుకొనేందుకు కనీసం ఐదు గంటలు నపడుతోందట మిమికి.