Categories

స్ట్రాబెర్రీ,బ్లూబెర్రీ,మల్బరీ పళ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయంటారు.కానీ ఖరీదు ఎక్కువ కనుక వీటిని అందరూ ఎక్కువ పరిమాణంలో తిన లేక పోతారు కానీ ఇదే పండ్లలో లభించే విటమిన్ సి,పీచు పదార్థాలు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ మనకు వేరే రకాల ఆహారాల నుంచి కూడా లభిస్తాయి.ముదురు రంగులో ఉండే రేగిపళ్ళు,నేరేడు పండ్లు,ఆల్ బుఖారా పండ్లు అలాగే బత్తాయి కమలా నారింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి.జమ సపోటా సీతాఫలం అరటి యాపిల్ వంటి పండ్లు మంచివే. ప్రత్యేకమైన పండ్లు తింటేనే ఆరోగ్యానికి మేలు చేస్తాయని అనుకోవడం అపోహ.అందుబాటులో ఉండే పండ్లే రోజుకు రెండు రకాలు ఆహారంలో భాగంగా తీసుకొంటే చాలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.