భారత దేశంలోఎన్నో ధాన్యాపు రకాలు దొరుకుతాయి. చిరు ధాన్యాలు, గోధుమలు ,మినుములు ,పెసలు, బ్లాక్ ,ఎరుపు ,తెలుపు రకాల బియ్యం విరివిగా దొరుకుతాయి. ప్రతి వంద కిలో మీటర్లకు దేశంలో వాడే ధాన్యాలు మారిపోతాయంటారు అందరికీ తమకి అందుబాటులో ఉండే ధాన్యాలతో ఎన్నో రకాల వంటలు చేసుకోవటం వచ్చు. ఈ రోజుల్లో యువత మొత్తం ఆరోగ్యం కోసం ,బరువు తగ్గటం కోసం పప్పులు దూరం పెడతారు. కొవ్వు ఉండే పదార్థాలు దగ్గరకు రానివ్వరు కానీ ఇది పొరపాటు అంటారు పోషకాహార నిపుణులు. ఆహారం పప్పు ధాన్యాలతో తినాలి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. పీచు ఉంటుంది .శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పప్పుల ద్వారా శరీరానికి లభిస్తాయి. పప్పు ధాన్యాలు,మొక్కల నుంచి లభించే ప్రోటీన్లు ,కాస్త కొవ్వు ఉంటే నెయ్యి నూనెతో కలిపి శరీరానికి ఎంత అవసరమో అంతే తింటే సరిసోతుంది. ఆహారం అప్పుడే సంపూర్ణం అవుతుంది.

Leave a comment