అందమైన చీరెకు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయితేనే చీరె అందం తెలుస్తుంది. ఇప్పుడు చాలా ఖరీదైన డిజైనర్ బ్లౌజ్లు ,పూర్తి ఎంబ్రయిడరీ చేసినవి మార్కెట్ లో కనిపిస్తున్నాయి.అయితే బ్లౌజ్ ఒకేలాగే ఉండాలనే రూల్ కు కాలం చెల్లిపోయింది. బ్లౌజ్ లకు లేస్ కట్ జత చేస్తే చక్కగా ఉంటుంది. అలాగే కలంకారీ బ్లౌజ్ నెక్ మోడల్ నుంచి బ్యాక్ డిజైన్ వరకు కొత్తగా ఉంటే అందం. ఈ బ్లౌజ్ నెక్ కు గోల్డ్ శాటిన్ పట్టీ ,సాదా అందమైన ఖరీదైన షిఫాన్ చీరెకు బావుంటుంది. అలాగే కాటన్ సిల్క్ చీరెలకు బ్లౌజ్ హెవీగా ఉండాలి.జరీ అంచు బార్డర్ తో హైనెక్ చాలా అందంగా ఉంటుంది.

Leave a comment