భారత దేశంలో విమానయాన ఫైర్ ఫైటర్ గా 29 ఏళ్ళ తానియా సన్యాల్ ఎంపికైంది. ఇప్పటివరకు పురుషులే ఈ ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 3,310 మంది ఫైర్ ఫైటర్స్ పని చేస్తూ ఉండగా కలకత్తాకు చెందిన తానియా సన్యాల్ తన ట్రైనింగ్ పూర్తి చేసుకొని కలకత్తా ఎయిర్ ఫోర్ట్ లో బాధ్యతలు స్వీకరించింది.విధి నిర్వహణలో భాగంగా 161 మందితో కూడిన పురుషబృందంతో జూనియర్ అసిస్టెంట్ గా పని చేయటంతో పాటు కలకత్తా సమీపంలోని నారాయనపూర్ లో ఉన్న ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ లో 133 మంది యువకులకు కూడా ఈమె శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది.తన ఉద్యోగం గురించి మాట్లాడుతూ ఇది నాకు గర్వాన్ని ,గౌరవాన్ని ఇచ్చింది.నేను ఎప్పుడూ ఒక ఛాలెంజింగ్ జాబ్ రావాలని కోరుకొనే దాన్ని,ఫైర్ ఫైటింగ్ నాకు సరైన జాబ్ అంటోంది తానియా.

Leave a comment