ఎండకు మొహం కమిలిపోయి నట్లు అయితే ముల్తానీ మట్టిని రోజ్ వాటర్ తో కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ముల్తానీ మట్టిలో స్పూన్ చొప్పున తులసి పొడి, గంధం పొడి వేసి పచ్చి పాలు పోసి పేస్ట్ లా చేయాలి ఈ పేస్ట్ ను ప్రతి రోజూ రాత్రివేళ ముఖానికి రాసుకుని కాసేపటికి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి ఇలా చేస్తే మొహం పై మచ్చలు మరకలు పోయి చర్మం నిగారింపు తో ఉంటుంది అలాగే ముల్తానీ మట్టిలో స్పూన్ బాదం నూనె టీ స్పూన్ తేనె అర స్పూన్ మీగడ రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం మెడ చేతులకు రాసుకుని పది నిమిషాల లో చల్లని నీళ్ళతో కడుక్కోవాలి ఇలా చేస్తే ముఖం మృదువుగా ఉంటుంది.

Leave a comment