కొన్ని సబ్జెక్ లలో అమ్మాయిలు,కొన్నింటిలో అబ్బాయిలు ఆసక్తి చూపిస్తారని లెక్కల వంటివి అబ్బాయిలంత వేగంగా అమ్మాయిలు చేయలేరని ,చరిత్ర వంటి వాటిల్లో అమ్మాయిలకు ఆసక్తి ఎక్కువ అని గతంలో ఒక అధ్యయనం చెప్పింది . కానీ కార్నిగే మెలన్ విశ్వవిద్యాలయ నిపుణులు అదంతా వట్టి మాట అంటున్నారు . మూడు నుంచి పదేళ్లలోపు వందమంది ఆడ ,మగ పిల్లల్ని ఎంపిక చేసి వాళ్లకు వీడియో పాఠాల ద్వారా గణితం బోధించారు . వాళ్ళ మెదడుని ఆ సమయంలో స్కాన్ చేసి చూశారట . లగే ఆ పాఠాల్ని పెద్దవాళ్ళు కూడా ఎలా రెస్పాండ్ అవుతారో చూశారు . వాళ్ళ మెదడు పనితీరులోనూ ఎలాటి వ్యత్యాసం కనిపించలేదు . ఈ అధ్యయనంలో నేర్చుకొనే విషయంలో అందరూ సమానులేనని అమ్మాయిలు,అబ్బాయిలు తేడా లేదనీ తేలింది .
ReplyForward

Leave a comment