Categories
ఉంగరాల జుట్టు అందంగానే వుంటుంది. ఒక్కసారి దువ్వేనకి కుడా లొంగక ఊరికే విసిగిస్తుంటుంది. అప్పుడు జుట్టు సాఫీగా అయిపోతే బావుండు అనుకుంటే హెయిర్ స్ట్రెయిట్ నర్ కొంబ్ ఉందనుకోండి. వెంటనే తలడువ్వు కొన్నంత ఈజీగా జుట్టు సాఫీ గా అయిపోతుంది. కరెంట్ తో పని చేసే ఈ దువ్వెనని బటన్ల ద్వారా కావలసినంత వేడి చేస్తే, ఆ వేడితో దీనికున్న సిరామిక్ కుదుళ్ళు ఉంగరాల జుట్టుని సాఫీగా మెరిసేలా చేస్తాయి. ఇక ఇంకో దువ్వెన పేరు యాంటీ డాండ్రఫ్ హెయిర్ కొంభ్ ఈ దువ్వెన లో వుండే చుండ్రుకు కారణమైన మృతకణాలు వదలగొట్ట వచ్చు. ఈ హైటెక్ దువ్వెనలు ఉంగరాల జుట్టును సాఫీగా మెరిసేలా చేసి, డాండ్రఫ్ ని మాయం చేస్తాయి.