చేదు రుచి తో ఉన్న కాకరకాయ శరీరానికి చక్కని పోషకాలు అందిస్తుంది.రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణాలు కాకరకాయల్లో పుష్కలంగా ఉన్నాయి.వ్యాధి కారకాలైన వైరస్ బ్యాక్టీరియా లతో పోరాడే శక్తి కాకర లో ఉంది వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే పొటాషియం శరీరంలోని అధిక సోడియం ను గ్రహించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.కాకరకాయలో తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేడ్లు, పీచు ఉండటంతో తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది జీర్ణశక్తి మెరుగవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.

Leave a comment