దక్షిణ కొరియా లోని ప్రతి బూటిక్స్ లో (అంటే ముఖ సౌందర్య సాధనాల దుకాణం అనమాట) ఒక మాయ దర్పణం వుంటుంది.దీన్ని ఎ.ఆర్ మిర్రర్ అంటారు.అంటే అగ్మెంటేడ్ రియాలిటీ మిర్రర్.కస్టమర్ మొహాన్ని స్కాన్ చేసి వాళ్ళు ఎంచుకున్న వస్తువును వాళ్ళు ధరిస్తే ఎలా ఉంటుందో అద్దం చూపిస్తుంది.ఒక్క సారి కస్టమర్ ఎంచుకున్న వస్తువు సరిగ్గా మ్యాచ్ అవ్వకపోతే హెచ్చరిస్తుంది.ఈ అద్దం లో ఉండే సెన్సార్ లు దగ్గరకు రాగానే ముఖాన్ని స్కాన్ చేసి చర్మం స్వభావం ముఖంపై ముడతలు నల్లని వలయాలు ఎలా ఉన్నాయో చూపించి ,వాటికోసం ఎలాంటివి ఎంచుకోవాలో సజెస్ట్ చేస్తుంది.ఈ మిర్రర్స్ సాయంతో బెస్ట్ షాపింగ్ చేశామని మహిళలు ఎంతో సంతోషంగా చెపుతున్నారు.ఇవి తొందరలోనే మనకు వచ్చేస్తాయి.

Leave a comment