వర్షం ఎప్పుడో ముందే ఊహించడం కష్టం.ఎండగా ఉంది కదా అని బయట అడుగుపెడితే అనుకోని వర్షం కురువచ్చు.ప్రతిసారీ రైన్ కోట్ వెంట పెట్టుకుని వెళ్ళలేక పోతాం.ఎంతో కొంత బరువు తో దాన్ని మోయటం కష్టం అలాంటప్పుడు బాల్ రైన్ కోట్ ఎంచుకోవచ్చు.దీన్ని కీచైన్ లాగా బ్యాగ్ కు తగిలించుకోవచ్చు.అత్యంత పలచని ప్లాస్టిక్ తో తయారు చేస్తారు.ఒక్కసారి వాడుకొన్నక దాన్ని బయట పడేయటమే…రెండోసారి వాడుకునేందుకు పనికిరాదు ధర కూడా చాలా తక్కువే ఇలాంటి బంతులను కొనుక్కుని బ్యాగ్ లో పడేసుకొంటే వాన ఎప్పుడు వస్తుందో అని భయపడాల్సిన పనిలేదు.హాయిగా తడిచి పోకుండా ఇంటికి చేరచ్చు.

Leave a comment