కళ్ళకు నచ్చితేనె కడుపుకు నచ్చుతాయాంటారు. ముఖ్యంగా పిల్లలు ఆకర్షణీయంగా ఉంటేనే నోట్లో పెట్టుకొంటారు. అందుకే స్వీట్లు,డిజర్ట్ లతో అందమైన అలంకరణలు కనిపిస్తాయి. పూవులు కొమ్మలు, రెమ్మలు ,పక్షుల రూపాలు కేకులపైన కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలంకరణలోకి తియ్యగా చప్పరించే అచ్చమైన ముత్యాల రూపాలు వచ్చాయి. చక్కెరలో వెన్న జిలాటెన్ ,గ్లిజరాల్ నీరు కలపి ఫాండెంట్ లా తయారు చేసి దాన్ని అందమైన ముత్యాలుగా చేసి ముత్యాల రంగులో ఉన్న లస్టర్ డాస్ట్ దొర్లిస్తారు. ఇక తినే పూసలు మెరిసిపోతూ ఉంటాయి. ఈ ఎడిబుల్ పెర్ల్స్ అనేక రకరకాల ప్లేవర్స్ ఉండే ఫాండెట్లు బేకరీల్లో దొరుకుతాయి. మనమే ముత్యాల్ని తయారు చేసుకోవచ్చు.

Leave a comment