తెల్లగా ,గోధుమ రంగులో ఉండే కోడి గుడ్లు తెలుసు .కానీ ఎన్నో రంగుల గుడ్లు ఉన్నాయి ప్రపంచంలో. అమెరికాలోని చిలీకి చెందిన అదకానీ జాతీ కోళ్ళు పెట్టే గుడ్లు నీలి రంగులో జన్యువు కారణంగా ఆ కోళ్ళు పెట్టే నీలి రంగులో ఉంటాయి.అలాగే అమెరికానీ, ఈస్టర్ ఎగ్గర్స్ క్రీమ్ లెగ్ బార్స్ జాతుల కోళ్ళు నీలి రంగు గుడ్లనే పెడతాయి. ఈస్టర్ ఎగ్గర్స్ నీలం ,ఆకుపచ్చ గోధుమ ఆలీవ్ ,క్రీమ్ ,గులాబీ ఇలా రంగు రంగుల గుడ్లు పెడతాయి. వీటిని రెయిన్ బో చికెన్స్ అంటారు. ఆలీవ్ ఎగ్గర్స్ జాతి కోళ్ళు ఆకురపచ్చని గుడ్లు పెడుతాయి.రోమ్ ఐలాండ్ ,డొమినిక్ , జెర్సీ జయింట్ ఫ్లెమత్ రాక్ వంటి జాతులు ముదురు గోధుమ రంగు గుడ్లు పెడతాయి. మారన్ జాతి కోళ్ళు చాకొలెట్ రంగు గుడ్లు పెడతాయి. మనిషి ఆలోచనలకు అందని వింతలు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి.

Leave a comment