అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో సైలెంట్ బుక్ క్లబ్ మొదటిసారిగా ఏర్పాటయింది.పుస్తకాలు నచ్చే వాళ్లంతా కలిసి ఓ క్లబ్ ఏర్పాటు చేసుకునేవారు అమెరికా తర్వాత ఈ ట్రెండ్ ప్రపంచం అంతా విస్తరించింది.16 దేశాల్లో 100 శాఖలుగా వర్ధిల్లుతోంది ఈ క్లబ్.మనదేశంలో ఉజ్జయిని, బెంగళూర్,చండీగర్ ,ఢిల్లీలో ఈ సైలెంట్ బుక్ క్లబ్ శాఖలున్నాయి.క్లబ్ వ్యక్తులు వారానికో నెలకో ఒక్కసారి కలుసుకుని అక్కడ ఇష్టమైన పదార్థాలు ఆర్డర్ చేసుకొని పుస్తకాల గురించి మాట్లాడుకొంటారు.చదివిన పుస్తకం గురించి చెబుతారు ఇలాంటి బుక్ క్లబ్ లో ఉండటం వల్ల పట్టణా సక్తి పెరుగుతోంది.ఇలాంటి బుక్ క్లబ్ ఏర్పాటు చేసుకోవాలంటే Silent Book Club లో చూసి వివరాలు తెలుసుకోవచ్చు.పుస్తకాలంటే ఇష్టపడే పాఠకులు కలిసే వేదిక ఇది.

Leave a comment